శ్రీలంకతో జరుగుతున్న టీ20లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. లంక బౌలర్ల దాటికి వరుసగా వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఇక.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా బౌండరీలు బాదుతూ శ్రీలంక బౌలర్ల మీద ఎదురుదాడికి దిగాడు. దాంతో టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది..
కరుణరత్నే బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (7 ), ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7 ) చేసి నిరాశ పరిచారు. ఇషాన్ కిషన్ (37), సంజు శాంసన్ (5), హార్దిక్ పాండ్యా (29) , దీపక్ హుడా 41, అక్షర్ పటేల్ 31లతో నాటౌట్‌గా నిలిచారు. ఇక.. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 12 పరుగుల వద్ద రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. శివమ్ బౌలింగ్‌లో నిసాంక (1) పరుగుకే పెవిలియన్ చేరాడు.. కాగా, శ్రీలంక పర్యటనలో భారత మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. రెండో టీ20 జనవరి 5న, మూడో టీ20 జనవరి 7వ తేదీన జరగనున్నాయి.