తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతల బృందం భేటీ అయ్యింది. వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం, రైతుల ఖాతాలో జమ చేయాలని, విద్యుత్ చార్జీల పెంపుపై, జీవో 111 ఎత్తివేతపై గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, అంజన్ కుమార్ తదితరులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement