Friday, November 22, 2024

దగ్గు సిరప్ డాక్1 మ్యాక్స్ ఉత్పత్తులను నిలిపివేశాం.. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా

దగ్గు సిరప్ డాక్1 మ్యాక్స్ వల్ల ఉజ్బెకిస్థాన్ లో 18మంది చిన్నారులు మరణించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ సంస్థలోని అన్ని రకాల ఉత్పత్తులను నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.ఈ సిరప్ ని భారత్ కు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసింది.ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) తనిఖీ తర్వాత తయారీని నిలిపివేయాలని ఆదేశించినట్లు మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు.

డాక్ -1 మ్యాక్స్ దగ్గు సిరప్‌లో కలుషితమైందన్న నివేదికల దృష్ట్యా సీడీఎస్ సీవో బృందం తనిఖీని అనుసరించి, నోయిడా యూనిట్‌లోని మారియన్ బయోటెక్ అన్ని తయారీ కార్యకలాపాలు నిన్న రాత్రి నిలిపివేయబడ్డాయి. తదుపరి విచారణ కొనసాగుతోందని ట్వీట్ లో తెలిపారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నోయిడాలో నిర్వహించిన తనిఖీలో ఉత్తరప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బృందాలు సహాయం అందించాయి. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 18 మంది పిల్లలు మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్ డోక్ 1 మాక్స్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించారు. ఈ మరణాలు సమర్‌కండ్ నగరంలో జరిగినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement