Wednesday, November 20, 2024

తీయ‌ని వేడుక: తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు తెలుగువారి పండుగైన‌ సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో లోగిళ్లు కొత్త శోభ నెల‌కొంది. ఇళ్లముందు తెల్లవారు జామునే అలుకు (క‌ల్లాపి) చల్లి , అందమైన ముగ్గులను ఆడపడుచులు తమ వాకిళ్లలో అలంకరిస్తున్నారు.

వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంక‌రింప‌జేస్తున్నారు చిన్నారులు. హరిదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలు, పతంగుల సంద‌డితో చిన్నా, పెద్దా సంబురాలు చేసుకుంటుండ‌గా పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. నిన్న భోగిమంటలు వెలిగించి పండగకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు ప్రజలు. ఇవాళ మకర సంక్రాంతి జరుపుతున్నారు. రేపు కనుమతో మూడొద్దుల సంక్రాంతి పండుగ సంబురంగా ముగియ‌నుంది.

లేటెస్ట్ ట్రెండ్ ప్ర‌కారం.. స్మార్ట్ ఫోన్ల‌లో ఫొటోలు, వీడియోలు.. మెస్సేజులు పంపించుకుని ఒక‌రినొక‌రు విష్ చేసుకుంటూ పండుగ జ‌రుపుకుంటున్న తీరును షేర్ చేసుకుంటున్నారు. శుభాకాంక్ష‌లు చెప్పుకుంటూ ప‌ర‌స్ప‌రం విషెష్ తెలియ‌జేసుకుంటున్నారు. దీంతో వాట్సాప్‌, టెలిగ్రామ్ వంటి మెస్సేజ్ లు ఫుల్ గా షేర్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement