ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవ్వాల మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది. ముంబైకి భారీ టార్గెట్‌నే పెట్టింది రాజస్థాన్. అయితే.. నిర్దేశించిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ (5) పెవిలియన్ చేరగా, ఆ తర్వాత అన్మోల్ ప్రీత్ సింగ్ (5) కూడా అవుటయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ (54) తిలవ వర్మ (61) వీరోచిత పోరాటం చేశారు. అయినా 15 ఓవర్లకు 136 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి టాపార్డర్ టఫా అనిపించుకుంది.. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఏం చేస్తారో చూడాలంటున్నారు క్రికెట్ అనలిస్టులు..
రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని చెరో వికెట్ తీసుకున్నారు. తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో సైని విఫలమయ్యాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైని తలో వికెట్ తీశారు. క్యాచ్ మిస్ అయి బతికిపోయాం అనుకున్న తిలక్ వర్మ అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.