Saturday, November 23, 2024

‘మోడ‌ర‌న్ టాయిలెట్’ ల‌ను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ లో నూతనంగా నిర్మించిన మోడరన్ టాయిలెట్ ను ఆయన ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా నివారించేందుకు GHMC ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో 1,950 టాయిలెట్ లను నిర్మిచామ‌న్నారు. వీటిలో 352 టాయిలెట్ ల నిర్వహణ ను BOT పద్దతిలో అప్పగించామ‌ని చెప్పారు. మొండా మార్కెట్ డివిజన్ లో నేడు 353 వ మోడరన్ టాయిలెట్ ను ప్రారంభించారు, ఓల్డ్ జైలు ఖానా వద్ద మరో మోడరన్ టాయిలెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ మోడరన్ టాయిలెట్ ల నిర్వహణ బాద్యత చేపట్టిన వారు టాయిలెట్ లను వినియోగించే వారి వద్ద నుండి సాధారణ రుసుము ను నిర్వహణ నిమిత్తం వసూలు చేస్తారని తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని, GHMC సిబ్బందికి సహకరిస్తూ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాల లో భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్చ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 4500 స్వచ్చ్ ఆటోలను ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్ళి చెత్తను సేకరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. GHMC ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం పలు అవార్డ్ లను అందజేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC ముకుందరెడ్డి, EE సుదర్శన్, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోఫర్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement