తమిళనాడుకు చెందిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ‘కైలాస’ పేరుతో ఏకంగా దేశాన్నే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ‘కైలాస’ దేశానికి రిజర్వు బ్యాంకును కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కైలాస దేశ కరెన్సీ అన్ని చోట్ల చెల్లుబాటు కాదని, తాను ఒప్పందం చేసుకున్న దేశాలతో మాత్రము అవుతుందని అప్పట్లో నిత్యానంద వెల్లడించారు. ‘‘పాండ్య, చోలా, కన్నడ, తెలంగాణ, గుర్జానా, సురంగి, కాశి, కంబోడియా- కంబోజ, శ్రీలంక – లంకాపురి, ఆఫ్గనిస్తాన్ – గాంధారా, నేపాల్- నేపాల’’ వీటన్నింటినీ హిందూ దేశాలుగా నిత్యానంద అభివర్ణించారు. నిత్యనంద లిస్టులో తెలంగాణ కూడా ఓ హిందూ దేశంగా ఉంది.
అయితే.. నిత్యానంద స్వామీజీ ప్రవచనాలకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. **మి.. ఈజ్ ఓన్లీ సిట్టింగ్ యాస్ మీ ఇన్ యు. దిస్ టు ఓన్లీ టాకింగ్ టు ఈచ్ అదర్.. అండర్ స్టాండ్, ఐ కెన్ ఓన్లీ టాక్ టు మీ, అండ్ గివ్ మై అండర్ స్టాండింగ్, ఐ కెన్నాట్ టాక్ టు ఎనీబడి ఎల్స్ అండ్ గివ్ మై అండర్‌స్టాండింగ్. సో ద మీ.. రిసైడ్స్ ఇన్ దిస్ యాస్ మి. ఈజ్ రిసైడింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ యాస్ మి. సో దట్ మి.. థ్రో దిస్ మి.. టాకింగ్ టు మి.. ** అంటూ చేసిన ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మీరు కూడా చూసి నిత్యానంద స్వామీజీ ప్రవచనాల సారాంశాన్ని తెలుసుకోండి..