పండుగలు వస్తే చాలు పలు ఆఫర్లు వస్తుంటాయి..వాటితో పాటు కొత్త కొత్త స్వీట్స్ కూడా తయారవుతుంటాయి. పండుగ అంటే స్వీట్స్..స్వీట్స్ అంటే పండుగ అనేలా మారింది. మరి స్వీట్స్ ధర ఎంత మహా అయితే ఐదు వందలు..లేదా వెయ్యి రూపాయలు..కానీ ఇక్కడ ఏకంగా కిలో స్వీట్ 11వేల రూపాయలు..ఏంటీ జోక్ అనుకుంటున్నారా..లేదండీ అక్షరాలా నిజం. రానున్నది దీపావళి.. ఈ పండుగకి టపాసులతో పాటు స్వీట్స్ కూడా ఎంతో ముఖ్యమనవి. అందుకే మహారాష్ట్రాలోని అమరావతి అనే పట్టణంలో ఓ స్వీట్ షాప్ యజమాని ప్రత్యేకమైన స్వీట్లను రూపొందించారు. వీరి స్వీట్లకు ఒక్క అమరావతిలనే కాకుండా నాగ్‌పూర్, విదర్భలాంటి ప్రాంతాల్లోనూ ఫుల్ డిమాండ్ ఉంది. అంతేకాకుండా అమరావతి నుంచి ఢిల్లీ, బెంగళూరులాంటి నగరాలకు కూడా ఈ స్వీట్లు ఎగుమతి కావడం విశేషం.
మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో రఘువీర్ స్వీట్ మార్ట్ ప్రతీఏటా దీపావళికి ప్రత్యేకంగా స్వీట్లను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఖరీదైన స్వీట్లను తయారు చేయడం ఈ మార్ట్ ప్రత్యేకత. ఇందులో భాగంగానే గతేడాది ‘సోనేరి భోగ్’ పేరుతో కిలో రూ. 7000 విలువ చేసే స్వీట్లను తయారు చేశారు. దీంతో ఈ స్వీట్‌కు అప్పట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈసారి మరింత ఎక్కువ ధరతో స్వీట్‌ను రూపొందించారు. ఈసారి ‘సువర్ణ కలష్’ పేరుతో ఏకంగా కేజీ రూ. 11,000 కావడం విశేషం. ఆకర్షణీయమైన గిఫ్ట్ బాక్స్‌లో అందిస్తారు. ఈ స్వీట్స్ తయారీలో బాదం, పిస్తా, కుంకుమపువ్వు వంటి వాటిని ఉపయోగించారు.వీటితో స్వీట్లను డెకరేషన్ చేయడానికి ఏకంగా బంగారంతో తయారు చేసిన ప్లేక్లను వాడడం విశేషం. రఘువీర్ స్వీట్స్ ప్రతీ ఏటా ఇలాగే బంగారంతో కూడిన స్వీట్లను తయారు చేస్తున్నారు.