అనుమానాస్పద రీతిలో మృతి చెందింది గ్యాంగ్ స్టర్ కన్హయ్య యాదవ్ కుమారై. దాంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏడుమంది సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్హయ్య యాదవ్ 22 ఏళ్ల పెద్ద కుమార్తె అనుమానాస్పద రీతిలో ఇంట్లో మృతిచెందింది. కన్హయ్ కుమారుడు విజయ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 154 సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. సయ్యిద్‌రాజా పోలీసు స్టేషన్‌లో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సయ్యిద్‌రాజా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఇతర మహిళా కానిస్టేబుళ్లతో కన్హయ్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో కన్హయ్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే నిషా అనే అమ్మాయిని విచారించారు. ఆమెని పోలీసులు చంపినట్లు మరో కుతురు గుంజన్ ఆరోపించింది. వంటిరిగా ఉన్న సమయంలో పోలీసులు ఇంట్లోకి చొరబడి తమను కొట్టినట్లు ఆమె చెప్పింది. ఇవాళ తెల్లవారుజామున నిషా తన రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ ఘటనలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. కూతురు మరణవార్త విన్న గ్యాంగ్‌స్టర్ కన్హయ్య యాదవ్‌కు కూడా ఆ ఇంటికి చేరుకున్నాడు. రోడ్డును మూసివేసిన స్థానికులు.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement