రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుని 12మంది రాజ్యసభ సభ్యులపై విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేయాలని కోరారు. కాగా వారి విన్నపాన్ని తోసి పుచ్చారు వెంకయ్యనాయుడు. ఎంపీలు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని అందుకే వారి సస్పెన్షన్ ని రద్దు చేయమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ చర్యలను నిరసిస్తూ లోక్‌సభ నుంచి కూడా విపక్షాలు వాకౌట్ చేశాయి. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన తెలియజేశారు. వెంకయ్య నాయుడిని కలిసిన వారిలో కాంగ్రెస్‌తో పాటుగా డీఎంకే, ఎన్సీపీ, శివసేన, సీపీఐ, సీపీఎం, ఆర్జేజీ, టీఆర్‌ఎస్, ఐయూఎంఎల్, ఆర్‌ఎస్పీ, ఎండీఎంకే, ఎల్‌జేడీ, ఎన్‌సీ, కేరళ కాంగ్రెస్, వీసీకే, ఆప్ సభ్యులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..