Friday, November 22, 2024

12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్​​ రాజ్యాంగ విరుద్ధం.. ఏకపక్ష నిర్ణయం: సుప్రీంకోర్టు

మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను నిరవధికంగా సస్సెన్షన్​ చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ‘‘ఇది రాజ్యంగ విరుద్ధం.. ఏకపక్ష నిర్ణయం”అని ధర్మాసనం ఈరోజు పేర్కొంది. ఆ సస్సెన్షన్​ జరిగిన వర్షాకాల సెషన్​ (జులై 2021) వరకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

గత ఏడాది జులైలో మహారాష్ట్ర అసెంబ్లీ గందరగోళం సృష్టిస్తూ, వికృత ప్రవర్తనతో సభను మాటి మాటికీ అడ్డుకుంటున్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్​ భాస్కర్​ జాదవ్ ఏడాది పాటు  సస్పెండ్​ చేశారు. సస్పెండ్​ అయిన వారిలో ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్కల్కర్, పరాగ్ అలవ్ని, హరీష్ పింపాలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే,  కీర్తికుమార్ బంగ్డియా ఉన్నారు.

సభ వాయిదా పడగానే విపక్ష నేతలు తన కేబిన్‌ వద్దకు వెళ్లి ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌, బీజేపీ సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ ఎదుట తనను దుర్భాషలాడారని స్పీకర్‌ జాదవ్‌ వివరించారు. అయితే ఈ సస్సెన్షన్​పై ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం అది రాజ్యాంగ విరుద్ధమని, ఆ సస్పెన్షన్​ తొలగిస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement