Sunday, November 17, 2024

ఈటల భవిష్యత్‌ కార్యచరణపై మళ్లీ సస్పెన్స్!

తన భవిష్యత్‌ కార్యచరణపై సరైన నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హైదరాబాద్ వెళ్లి అక్కడి శ్రేయోభిలాషులతో కూడా చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటకే నియోజకవర్గ శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులతో చర్చించానని, తనను ఈ స్థాయికి తెచ్చినవారి అభిప్రాయాలు తీసుకున్నానని తెలిపారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాతం హుజూరాబాద్ నియోజకవర్గం అని అన్నారు. కరోనా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కొందరు సలహా ఇచ్చారని, మరికొందరు 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలు గుర్తు చేశారని తెలిపారు. అనేక నియోజకవర్గాల నుంచి వచ్చిన ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారని చెప్పారు. కరీంనగరే కాదు.. 9 జిల్లాల నుంచి కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆత్మగౌర‌వ స‌మ‌స్య ఏర్ప‌డిందని ఈటల వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement