కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సురేష్ పోటీచేసి సురేష్ ఓడారు. బీవీపీ, బీజేవైఎంలో సురష్ కీలక పాత్ర పోషించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో ఆయన ఎమ్మెల్యే భార్యనే వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి.
కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ.. ఉప ఎన్నికల బరిలో నిలిచింది. గత తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలోనూ బీజేపీ పోటీ చేయగా.. అభ్యర్థి రత్న ప్రభ ఓటమిపాలైయ్యారు. ఈ సారి కూడా అధికార బలంతోపాటు సానుభూతి పవనాలు వైసీపీ అభ్యర్థికి ప్లస్ కానున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో విజయం ఏకపక్షమే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: బాదుడే.. బాదుడు: హైదరాబాద్ లో సెంచరీ దాటిన డీజిల్ ధర