తనకు అడ్వాన్స్ లను నిరాకరించినందుకు 21 ఏళ్ల మహిళను గొంతు కోసి చంపేసిన ఘటన గుజారత్ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడు ఫెనిల్ గోయానీకి సూరత్ కోర్టు ఇవ్వాల మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లువెత్తింది. రాష్ట్రంలో శాంతిభద్రతల తీరు బాగాలేదన్న విమర్శలు, ప్రశ్నలు తలెత్తాయి. అయితే.. 10 రోజుల్లోనే 2500 పేజీల చార్జిషీట్‌తో దాఖలు చేశారు పోలీసులు. కాగా, 70 రోజుల్లో నిందితుడికి మరణశిక్ష ఖరారయ్యింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 12న సూరత్‌లోని పసోదరలో నిందితుడు ఫెనిల్.. గ్రీష్మా కుటుంబసభ్యుల ఎదుటే గొంతు కోసి హత్య చేశాడు. గ్రీష్మా సోదరుడు, మామ ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు ఫెనిల్ వారిపై కూడా దాడి చేశాడు. ఆమె పలుమార్లు అడ్వాన్స్ లు నిరాకరించడంతో ఈ హత్య చేసేందుకు పథకం వేశాడు. అయితే ఈ ఘటనపై గుజరాత్లో శాంతిభద్రతల ప్రశ్న తలెత్తింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి.
10 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు..
గ్రిష్మాను హత్య చేసిన తర్వాత ఫెనిల్ ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్టు చేశారు. హత్యకు ముందు ఫెనిల్ గ్రిష్మాను వేధించేవాడని, ఆమెకు దూరంగా ఉండాలని పలుమార్లు ఆమె కుటుంబం కోరినా అతను వినిపించుకోలేదు. ఈ విషయమై గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి గ్రీష్మా కుటుంబాన్ని పరామర్శించారు. వారికి అన్నివిధాలా ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.