Saturday, November 23, 2024

జీవించే హక్కు కంటే మత విశ్వాసాలేమీ ముఖ్యం కాదు: సుప్రీం..

కరోనా మహమ్మారి సమయంలో జరుగుతున్న కన్వర్ యాత్రను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  మామూలుగా అయితే హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకువస్తారు కాని ఈ సారి అనుమతించవద్దని రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని మిగిలిన రాష్ట్రాలకు అనుమతించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగాజలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలేమీ ముఖ్యం కాదని కీలక వ్యాఖ్యలు చేసింది.

హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి కన్వరియాలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది తన అఫిడవిట్ లో పేర్కొంది. అయితే మతవిశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు పేర్కొంది. సం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆ నీటినే సమీపంలో శివాలయాల్లో అభిషేకానికి వినియోగించుకోవలసిందిగా సూచించామని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేసుకోవలసిందిగా భక్తులకు సూచించినట్టు సుప్రీం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై డైలాగ్ వార్

Advertisement

తాజా వార్తలు

Advertisement