సుప్రీం కోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిలో భూముల స్కాం జరిగిందని వేసిన ఫిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జస్టీస్ ఎన్ వీ రమణకు అమరావతి భూముల కేసును విచారిస్తున్న జడ్జిలకు ఎన్ వీ రమణ అడ్డుపడుతున్నారని ఫిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. అయితే దీనిని పరిశీలించిన సుప్రీం కోర్టు..ఫిర్యాదు వ్యవహారంపై ఓ ప్రకటన విడుదల చేసింది. అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జస్టిస్ ఎన్వీ రమణ పాత్రపై ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదును అంతర్గతంగా పరిశీలించి, విచారించిన తర్వాతే దానిని కొట్టేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన స్టేట్మెంట్ లో పేర్కొంది. అదే సమయంలో జస్టిస్ రమణపై ఫిర్యాదు వ్యవహారంపై కోర్టులో అంతర్గతంగా సాగిన విచారణ తీరుతెన్నులు ఎప్పటికీ గోప్యంగానే ఉంటాయని, జనసామాన్యానికి వాటిని బహిర్గతపర్చే వీలుండదని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేసిన కొద్దిసేపటికే, ఆయనపై ఏపీ సీఎం చేసిన ఫిర్యాదుపైనా ప్రస్తుత సీజేఐ బోబ్డే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement