Friday, November 22, 2024

Supreme: ఢిల్లీ పొల్యూష‌న్ కంటే.. టీవీ డిబేట్లే ఎక్కువ ప్రాబ్లం అవుతున్న‌య్‌.. సీజేఐ కామెంట్స్

ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్ దారుణంగా దెబ్బ‌తింటోంది. అస్స‌లు మొస తీసుకునే ప‌రిస్థితి కూడా లేదు. ఊపిరి స‌ల‌ప‌ని ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టు ఢిల్లీ స‌ర్కారు వెంట‌నే పొల్యూష‌న్ కంట్రోల్ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించింది. అయితే దీనిపై ప‌లు టీవీ చాన‌ళ్లు స్పెష‌ల్ డిబేట్లు పెట్టి ప‌దే ప‌దే ఊద‌ర‌గొడుతున్నాయి.

ఈ క్ర‌మంలో బుధ‌వారం సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌వీ ర‌మ‌ణ టీవీ చాన‌ళ్ల డిబేట్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు ఎయిర్ పొల్యూష‌న్ కంటే టీవీ డిబేట్ల‌తోనే ప్రాబ్లం ఎక్కువ‌వుతోంద‌ని మండిప‌డ్డారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ అని.. దీన్ని ప‌దే ప‌దే ప్ర‌సారం చేసి కాంట్ర‌వ‌ర్స‌ల్ చేయొద్ద‌ని సూచించారు.

అదేవిధంగా ఢిల్లీ స్టూడెంట్స్‌పై ఎయిర్ పొల్యూష‌న్ ప్ర‌భావం చూపుతోంద‌న్న పిల్ (ప‌బ్లిక్ ఇంట్ర‌స్ట్ లిటిగేష‌న్‌) విష‌యంలో సీజేఐ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. మీకు ఏదైనా ఒక స‌మస్య ఉత్ప‌న్నం కావాలి.. దాన్ని ప‌దే ప‌దే లాగుతూ కాంట్ర‌వ‌ర్సి చేయాలి. ఆ బ్లేమ్ గేమ్ ని ప‌దే ప‌దే చూపించాలి.. ఇదేనా మీరు డిబేట్ చేసే విధానం.. అంటూ టీవీ డిబేట్ల‌పై సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేశారు.

రైతులు త‌మ పొలాల్లోని పొట్టును త‌గ‌ల‌బెట్ట‌డంతోనే ఢిల్లీలో ఎయిర్ పొల్యూష‌న్ పెరిగింద‌న్న విష‌యంపై సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడారు. సుప్రీంకోర్టును టీవీ న్యూస్ తప్పుదోవ ప‌ట్టించాయ‌ని టీవీ చర్చల అంశాన్ని ఆయ‌న లేవనెత్తారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. మమ్మల్ని ఎవ‌రూ తప్పుదోవ పట్టించాల్సిన అవ‌స‌రం లేదు అని రిప్లై ఇచ్చారు.

CJI ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలో సాగుతున్న ధ‌ర్మాస‌నంలోని జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. “మనం చూస్తున్నది ఏమిటంటే.. ఈ శాతంతో, లెక్క‌ల‌తో సంబంధం లేకుండా రైతుల‌ దుస్థితిని చూడాలి. వారు ఏ పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వ‌స్తోందో అని ఎవరూ పరిశీలించ లేదు అన్నారు. ఫైవ్ స్టార్‌, సెవెన్ స్టార్ హైరేంజ్ బిల్డింగ్‌ల్లో ఏసీల కింద కూర్చున్న వారు రైతుల గురించి ఏం మాట్ల‌డ‌గ‌ల‌రు. చిన్న చిన్న క‌మ‌తాలున్న రైతులు పొలాల్లోంచి పొట్టు త‌ర‌లించే భారాన్ని త‌ట్టుకోగ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement