Tuesday, November 26, 2024

ఉచితాల‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఉచితాల‌పై డీఎంకే దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సీజేఐ ఎన్ వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచారించింది. హామీల‌ను గుప్పించ‌కుండా రాజ‌కీయ పార్టీల‌ను నియంత్రించ‌లేమ‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల సంక్షేమ ప్ర‌భుత్వాల భాధ్య‌త‌ని, ప్ర‌జా ధ‌నాన్ని స‌రైన ప‌ద్ధ‌తిలో వెచ్చించ‌డ‌మే ఇక్క‌డ ప్ర‌ధాన అంశ‌మ‌ని సీజేఐ నొక్కిచెప్పారు. ఈ వ్య‌వ‌హారం చాలా సంక్లిష్ట‌మైన‌ద‌ని, అస‌లు ఈ అంశాల‌ను న్యాయ‌స్ధానం ప‌రిశీలించ‌వ‌చ్చా అనే ప్ర‌శ్న కూడా త‌లెత్తుతుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఉచిత హామీల అంశంపై డీఎంకే మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల తాయిలాలుగా పేర్కొన‌రాద‌ని డీఎంకే వాదిస్తోంది. విస్తృత‌, బ‌హుళ ఉద్దేశాల‌తో సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌ల‌వుతాయ‌ని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement