Tuesday, November 19, 2024

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రిజర్వేషన్ల కోసం నిబంధనలను బలహీనపరచబోమని చెప్పింది. రిజర్వేషన్ల కల్పనకు నిర్దిష్టమైన, కచ్చితమైన ప్రమాణాలు నిర్ధరించడంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపారు. ఆయా రాష్ట్రాలే పదోన్నతులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందా? అనే అంశంపై సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత రాష్ట్రాలదేనని తెలిపింది. రిజర్వేషన్లపై సమాచారాన్ని కేడర్ బేస్డ్ వేకెన్సీల ప్రాతిపదికపై సేకరించాలని చెప్పింది. రిజర్వేషన్ల కల్పన కోసం రాష్ట్రాలు సమీక్షను నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ​ నాగేశ్వర్​రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ల మంజూరుపై తీర్పును సుప్రీంకోర్టు అక్టోబరు 26న రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. 133 పిటిషన్లపై వాదనలను విన్న తర్వాత శుక్రవారం ఈ తీర్పును ఇచ్చింది.

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్​ 6న సుప్రీంకు తెలిపింది. ఇది వాస్తవమని, దీనిని పరిష్కారంగా సుప్రీంకోర్టే తగిన ప్రతిపాదనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించింది. అప్పుడు కూడా ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement