యావత్ దేశం మొత్తం తీవ్ర చర్చనీయాంశంగా మారిన దిశ సంఘటన పై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టియించిన దిశ కేసులో సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ ముగిసింది. సిర్పూర్ కర్ కమిషన్ సమర్పించిన నివేదిక పై ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కీలక ప్రకటన చేసే అవకాశముంది. దిశ అత్యాచారం, హత్య తర్వాత పోలీస్ కస్టడీలో ఉండగా జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకపు ఎన్ కౌంటరా, నిజమైన ఎన్ కౌంటరేనా అని నిగ్గు తేల్చనుంది సుప్రీంకోర్టు. సిర్పూర్ కర్ ఇచ్చిన నివేదికలో అసలు ఏముంది. కమిషన్ ఇచ్చిన నివేదిక పై సుప్రీంకోర్టు ఎలాంటి ప్రకటన చేయనుందనే విషయమై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి మొదటి వారంలో దిశ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రంగారెడ్డి జిల్లా చటాన్ పల్లిలో 2019 డిసెంబర్ 6న దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగానే మరణించిన ఘటనపై సుప్రీం కోర్టు నియమించిన సిర్పూర్ కర్ కమిషన్ దాదాపు 3 సంవత్సరాల పాటు విచారించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement