గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. బెయిల్ నిబంధన సడలించాలన్న గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.వెంటనే ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజు వారీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులు మాత్రమే బళ్ళారి లో ఉండేందుకు గాలికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.