బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అంతేగాక, తమ నోటీసులకు మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్ నెలలో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement