ఓట్ల లెక్కింపులో ఈవీఎంలతో అన్ని వీవీప్యాట్లనూ లెక్కించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. 100 శాతం వీవీ ప్యాట్ల లెక్కింపు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు గోపాల్ సేత్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తిరస్కరించిది. దీంతో పాటు ఇదే అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.
గతంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన తీర్పే అమలవుతుందని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. నాటి తీర్పు ప్రకారం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు యంత్రాల్లోని వీవీ ప్యాట్లనే లెక్కించనుంది ఈసీ. అయితే అంతకుముందు ఒక్కో నియోజకవర్గంలో కేవలం ఒక్క యంత్రంలోని స్లిప్పులనే లెక్కించేవారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ పారదర్శకతను ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది.