Friday, November 22, 2024

Breaking: డ్రగ్స్​ మాఫియాపై సుప్రీంకోర్టు సీరియస్​.. సుమోటోగా కేసు నమోదు, కేంద్రానికి నోటీసులు!

దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాపై సుప్రీంకోర్టు సీరియస్​ అయ్యింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న విధానం, లోకల్​ గ్యాంగుల నిర్వాకంపై​ సుప్రీంకోర్టు ఆరా తీసింది. దీన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. అయితే.. ఇదంతా మాజీ సీజేఐ ఎన్వీ రమణ లేఖ ఆధారంగానే జరిగిందని తెలుస్తోంది. ఇక.. కోర్టు విచారణలో సహకారిగా షోయబ్​ ఆలం నియమకమయ్యారు. ఈ క్రమంలో ఇవ్వాల (సోమవారం) కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కాగా, అక్టోబర్​ 18వ తేదీ నుంచి డ్రగ్స్​ కేసు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గుజరాత్​, ముంబయి రాష్ట్రాల నుంచే దేశంలోకి..

దేశంలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. దీనికి అడ్డాగా గుజరాత్​, ముంబయి రాష్ట్రాలే అడ్డగా మారాయి. దీనికి అక్కడ పెద్దమొత్తంలో డ్రగ్స్​ పట్టుబడడమే సాక్ష్యం. ముఖ్యంగా యువతను టార్గెట్‌ చేసుకుంటున్న డ్రగ్స్​ మాఫియా ఆ మేరకు మత్తు పదార్థాలను సప్లయ్ చేస్తోంది. దీనికోసం సరికొత్త మార్గాలను కూడా అన్వేషిస్తోంది. లేటెస్ట్ గా ముంబై ఎయిర్‌పోర్టు, గుజరాత్​ పోర్టులలో పట్టుబడిన హెరాయిన్​తో ముఠా ఆనవాళ్లు లభించాయి. దాదాపు వేల కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.

ఈ మధ్య గుజరాత్‌ తీరంలో డ్రగ్స్‌ కలకలం చెలరేగింది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు అధికారులు. ఎన్సీబీ, నేవీ జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయింది. మొత్తం 800 కేజీల డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. మరోవైపు వారం క్రితం భారత్- పాకిస్థాన్ సరిహద్దులో భారీగా హెరాయిన్‌ సీజ్‌ చేశారు. 14 కిలోలకుపైగా హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ రూ. 35 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. పాకిస్థాన్ మీదుగా భారత్​లోకి ఈ డ్రగ్స్​సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌, రాజస్థాన్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ హెరాయిన్‌ పట్టుబడింది. ఇక ఇటీవల మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలోనూ.. 25కోట్ల రూపాయల హెరాయిన్‌ పట్టుబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement