సాక్షాత్త్ దేశ ప్రధానికే రక్షణ కరువయితే మిగతా వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పంజాబ్ పర్యటన , ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది. కాగా ఈ పిటీషన్ ని సుప్రీంకోర్టు నేడు విచారించింది. ఈ మేరకు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఆయన పంజాబ్ , హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్ట్ లో వాదనల సందర్భంగా…ఈ ఘటన అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోందని పంజాబ్ ఏజీ సీనియర్ న్యాయవాది డీఎస్ పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..