సుప్రీంకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ బి. ఆర్. గవాయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. బెయిల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
అంతకు ముందు… రఘురామ పిటిషన్ పై విచారణ వాడివేడిగా సాగాయి. రఘురామకృష్ణంరాజు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేవలం బెయిల్ రాకూడదని సెక్షన్ 124 ఏ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు, కస్టడీలో రఘురామకృష్ణం తీవ్రంగా కొట్టారు చెప్పారు. కాళ్ళకు తగిలిన గాయాలను ఎంపీ మెజిస్ట్రేట్ కు చూపించారని న్యాయవాదం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామకృష్ణంరాజు డిసెంబర్ లో బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పారు. రోహత్గి వాదనపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అభ్యంతరం లేదని ముకుల్ రోహత్గి చెప్పారు.