Monday, November 18, 2024

ఏపీ సీఐడీ కేసులో రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్

ఏపీ సీఐడీ పెట్టిన రాజ‌ద్రోహం కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరుకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం పలికింది. అయితే రఘురామ సీఐడీకి సహకరించాలని, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని కోర్టు సూచించింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దాంతోపాటు బెయిల్‌కు సంబంధించి, కస్టడీకి సంబంధించిన విషయాలపై రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకు కానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడకూడదని ఆదేశించింది. ఒకవేళ వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది

శుక్రవారం ఉదయం నుంచి ఎంపీ రఘురామ బెయిల్ పిటిష‌న్‌పై సీనియ‌ర్ లాయ‌ర్లు ముకుల్ రోహ‌త్గీ ఎంపీ త‌రుఫున‌, ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున దుష్యంత్ ద‌వే వాద‌న‌లు వినిపించారు. ఆర్మీ రిపోర్టు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం… ఏపీ సీఐడీ ఎంపీని సరిగ్గా ట్రీట్ చేయ‌లేద‌న్న ప్రాథ‌మిక స‌మాచారం, ఎంపీకి గుండె సంబంధిత స‌ర్జ‌రీ అయిన నేప‌థ్యంలో బెయిల్ ఇస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. కాగా సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో మరోసారి జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైందనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement