Saturday, November 2, 2024

కప్పన్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించండి: సుప్రీం కోర్టు

కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిక్‌ కప్పన్‌ ఆరోగ్యంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయనను చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని సూచించింది. సిద్ధిక్‌ కప్పన్‌ కోలుకున్న తర్వాత అతన్ని తిరిగి మధుర జైలుకు పంపించాలని తెలిపింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కప్పన్‌ ను ఢిల్లీ ఎయిమ్స్‌ తరలించాలని కోరుతూ కేరళ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్సు ఈ నెల 20న సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కప్పన్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ తరలించాలని  స్పష్టం చేసింది.

గతేడాది అక్టోబర్ లో హాత్రస్ అత్యాచార ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ ను యూపీ సర్కారు అదుపులోకి తీసుకున్నారు. యూఏపీఏ వంటి కఠిన చట్టాల కింద కేసులు పెట్టారు. సుదీర్ఘకాలంగా జైలులో ఉంటోన్న ఆయనకు ఇటీవల కరోనా సోకగా, మథురలోని మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో ఆయన్ను ఒక మంచంపై జంతువును కట్టేసినట్లు కట్టేశారని, కనీసం టాయిలెట్ కు కూడా వెళ్లనీయకుండా ప్లాస్టిక్ డబ్బాలోనే మూత్రం పోయిస్తున్నారని ఆయన భార్య రైహంత్‌ కప్పన్‌ ఆరోపించారు. సరైన ఆహారం కూడా లేదని, ఈ నేపథ్యంలో తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ఆయన్ను వెంటనే మథుర హాస్పిటల్‌ నుంచి మథుర జైలుకు తిరిగి తరలించేందుకు జోక్యం చేసుకోవాలని లేఖలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్.వి.రమణను కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement