భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజేఐగా కొనసాగుతున్న ఎస్ఏ బోబ్డే పదవీ కాలం శుక్రవారంతో ముగుస్తుండంతో ఈరోజే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం శనివారం సాయంత్రం జస్టిస్ బోబ్డేకు వీడ్కోలు సమావేశం నిర్వహించి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా కారణంగా ఈ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నారు. శనివారం నాడు 48వ సీజేఐగా ఎన్వీ రమణ చేత రాష్ట్రపతి కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమం అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement