సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోకు తీసుకురానున్నారు. నిన్న తెల్లవారుజామున కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత నానక్‌రామ్‌గూడలోని తన నివాసమైన విజయకృష్ణ నిలయానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి వచ్చి కృష్ణకు నివాళులు అర్పించారు.
అయితే.. అక్కడికి అభిమానులను, సామన్య ప్రజలను అనుమతించ లేదు. ఈ క్రమంలో మరికాసేపట్లో ఆయన పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. అక్కడ ఆయన అభిమానులతోపాటు, సాధారణ ప్రజలకు కృష్ణను కడసారి చూసే అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం స్టూడియోలోనే కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిన్న కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించిన సందర్భంగా కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.