ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. హైదరాబాద్ సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ముంబయిని ఊచకోత కోసింది. ముంబయి బౌలర్లను చితక్కొట్టి కొత్త రికార్డు సృష్టించారు. ఇక.. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఊపుమీద ప్రారంభించగా.. కొద్దిసేపటికి మయాంక్ 11 పరుగులకు అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి అభిషేక్ శర్మ వచ్చాడు..
ఇక.. ట్రావిస్‌తో జత కలిసి ఇద్దరూ ముంబయిని ఊచకోత కోశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 7 ఓవర్లలో 100 పరుగులు దాటించారు. ఆ తర్వాత హెడ్ (62) వద్ద అవుటవ్వగా అయిడెన్ మార్క్రమ్ వచ్చి అదే ఊపులో దంచికొట్టాడు. కాగా, అబిషేక్ 16బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సాధించాడు.. ఇక.. 63 పరుగుల వద్ద అవుటవ్వడంతో క్లాసెన్ వచ్చి ఉతికి ఆరేశాడు.. క్లాసెన్ 80, మార్క్రమ్ 42 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 20 ఓవర్లలో 277 పరుగులు చేసి ఇంతకుముందు ఆర్‌సీబీ పేరుతో 263 పరుగుల రికార్డును బ్రేక్ చేశారు.. ఇక.. ముంబయి టార్గెట్ 278 పరుగులుగా ఉంది. టాటా ఐపీఎల్ చరిత్రలోనే హయ్యస్ట్ స్కోరుగా హైదరాబాద్ జట్టు స్కో,రు సెట్ చేసింది..