సన్ రైజర్స్ హైదరాబాద్.. కెప్టన్ డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో వార్నర్ ఉంటాడా?లేడా? అనేది సందేహంగా మారింది. తర్వాత మ్యాచ్ నుంచి కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఉంటాడంటూ సన్ రైజర్స్ ప్రకటించింది.
ఐపీఎల్ లో మెరుగైన రికార్డు కలిగివున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో మాత్రం పరమచెత్తగా ఆడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి ఒక్కదాంట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ సామర్థ్యంపై విమర్శకులు వచ్చాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరిగే మ్యాచ్ తో పాటు టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు ఇకపై సన్ రైజర్స్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది. కాగా, సన్ రైజర్స్ టీమ్ రేపు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడనుంది.