ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరగడానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాదుకు పెద్ద షాక్ తగిలింది. అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశారు. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల కోసం జరిగిన మెగా వేలం పాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాజమాన్యంతో విభేదాలు వచ్చినందుకే జట్టును వీడుతున్నట్టు చెపుతున్నారు. ఆ సీజన్‌లో 2016లో జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు కనీసం తుది జట్టులో చోటు కల్పించలేదు. పేలవ ప్రదర్శనకు తోడు వార్నర్, రషీద్ లాంటి స్టార్ ప్లేయర్లను వదులుకున్న క్రమంలో ఐపీఎల్-2022 సీజన్ నేపథ్యంలో సన్‌రైజర్స్ కొత్త సిబ్బందితో ముందుకు వచ్చింది.
మెగా వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. వేలం కోసం ముందుగా వేసిన ప్రణాళికలన్నీ కూడా వేలంలో విస్మరించబడ్డాయని ఆరోపిస్తూ రాజీనామా చేశాడు. దీంతో సన్ రైజర్స్ ప్రస్తుతం కొత్త అసిస్టెంట్ కోచ్‌ను వెతికే పనిలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital