Monday, November 18, 2024

MP Santhosh: ప్రతి పక్షి, ప్రతి చెట్టు సజీవంగా ఉంటాయి: సండే వైబ్స్

మనకు అవసరమైనవెన్నో ప్రకృతిలో ఉన్నాయి. అందులో పక్షలు ముఖ్యమైనవి. అంతరించిపోతున్న పక్షుల్ని కాపాడుకునేందుకు, పక్షుల అవసరం, ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతీ ఏడాది జనవరి 5న నేషనల్‌ బర్డ్‌ డేని పాటిస్తారు. మానవ జీవితాల్లో పక్షులు  ప్రత్యేక స్థానాన్ని సొంతంచేసుకున్నాయి. అయితే, పర్యావరణ వ్యవస్థలలో కాలానుగుణ మార్పులతో చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. ప్రకృతిని ప్రేమించే టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పలు పక్షలకు సంబంధించిన ఫొటోలు తీశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్నారు. తాజాగా పక్షలపై తనకున్న ప్రేమను ఎంపీ సంతోష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘’రచయిత మార్టీ రూబిన్ చెప్పినట్లుగా, “ప్రతి పక్షి, ప్రతి చెట్టు, ప్రతి పువ్వు నాకు సజీవంగా ఉండటం ఎంత గొప్ప ఆశీర్వాదమో గుర్తుచేస్తుంది”. నేను ఈ గోల్డెన్ ఓరియోల్ ​​క్యాప్చర్ చేసినప్పుడు ఇది నిజమని నమ్ముతున్నాను’’ అంటూ సంతోష్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement