Tuesday, November 19, 2024

భ‌విష్య‌త్ ప్ర‌చండ‌మే….

జెనీవా: రాబోయే ఐదేళ్లు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉంటాయని, రికార్డు స్థాయికి చేరుకోవచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రతికూల వాతావరణం ఉండేందుకు 98 శాతం అవకాశం ఉందని బుధవారం నాటి ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో కనీసం ఒకదానిలో ఎన్నడూ లేనంత వేడిగా ఉండే అవకాశం 98 శాతం ఉందని హెచ్చరించింది. ఐరాసలోని ప్రపంచ వాతావరణ సంస్థ ఈ మేరకు అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం 2023- 2027 మధ్య ఏదైనా ఒక సంవత్సరంలో వార్షిక సగటు భూగోళ ఉష్ణోగ్రత కనీసం పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉండే అవకాశం 66 శాతం ఉంది. ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రటరీ జనరల్‌ పెట్టెరి తాలస్‌ను ఉటంకిస్తూ, ఇది ఆరోగ్యం, ఆహార భద్రత, నీటి నిర్వ#హణ, పర్యావరణానికి చాలా దుష్పరిణామాలను కలిగిస్తుందని, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేందు కు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని కోరింది.

ష ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల స#హజంగా సంభవించే ఎల్‌ నినో వాతావరణ నమూనాలు, గ్రీన్‌#హౌస్‌ వాయువుల ద్వారా ప్రేరేపితం అవుతుంది. 2016లో నెలకొల్పబడిన ఉష్ణోగ్రత రికార్డు కంటే వచ్చే ఐదేళ్లలో కనీసం ఒక్కసారైనా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం 98 శాతం ఉందని ఐరాస ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ సంవత్సరం అనూ#హ్యంగా బలమైన ఎల్‌ నినో ఉంటుందని తెలిపింది.

ష 2023 మే నుండి జూలై వరకు ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 60 శాతం ఉన్నందున, గ్లోబల్‌ ఉష్ణోగ్రతలు 2024లో పెరిగే అవకాశం ఉంది. ఎల్‌ నినో అభివృద్ధి చెందిన తర్వాత సంవత్సరంలో గ్లోబల్‌ ఉష్ణోగ్రతలు పెరగడానికి ఆస్కారముంది.
ష ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రత క్రమరా#హత్యం (దీర్ఘకాల సగటు లేదా సూచన విలువ నుండి నిష్క్రమణ) తదుపరి ఐదు ఉత్తర అర్ధగోళంలో విస్తరించిన శీతాకాలాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ప్రపంచ క్రమరా#హత్యం ఊ#హంచిన దానికంటే మూడు రెట్లు అధికంగా అంచనా వేయబడింది.

- Advertisement -

ష ఆర్కిటిక్‌లో 1991-2020 దీర్ఘకాలిక సగటు ఉష్ణోగ్రత ఆధారంగా ఈ అంచనా వేయబడింది. 1991 నుండి 2020 సగటు వర్షపాతంతో పోలిస్తే, మే నుండి సెప్టెంబరు 2023-2027 సగటు వర్షపాతం నమూనాలు ఉత్తర ఐరోపా, ఉత్తర సైబీరియా, సా##హల్‌, అలాస్కాలో పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అమెజాన్‌, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలో వర్షాలు తగ్గుతాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement