Wednesday, November 20, 2024

ఎర్ర‌టి ఎండ‌లో చ‌ల్ల‌టి ఐస్ క్రీమ్.. నోరూరిస్తున్న రుచులు

ప్రభన్యూస్‌ : భగ భగ మండుతున్న ఎండలు.. ఊష్ణ తాపాన్ని అదుపు చేసేందుకు మంచు ముద్దలు.. అవి తినడంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడ ఉంటుంది.. మార్చి నెలలోనే నిప్పుల కుంపటిలా మండుతున్న వేసవి.. అయితే శరీరాన్ని చల్ల బరుచుకునేందుకు వీలైనంత మేరకు ఐస్‌క్రీంలు తినేందుకు అధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు పుల్ల ఐస్‌క్రీం.. తెల్లటి నురుగుతో ఉండే పాల ఐస్‌క్రీం.. సేమియా ఐస్‌క్రీంలు పల్లెల్లో హల్‌ చల్‌ చేస్తుండేవి.. అయితే ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా 25 నుంచి 30 రకాల ఐస్‌క్రీంలు సరికొత్త రంగులతో నోరూరించే హొయలతో మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. జలుబు చేస్తుందన్న భయం.. మధుమేహం బాదిస్తోందనే ఆందోళన.. ఐస్‌క్రీం హవా ముందు బలాదూర్‌ అయిపోతున్నాయి. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదంటూ… పిల్లల నుంచి పెద్దల దాకా నోరూరా చల్లటి ఐస్‌క్రీంలను తింటూ శరీరాన్ని చల్లబరుచు కుంటున్నారు.

రక రకాల రంగుల్లో..

ఇప్పుడు మార్కెట్‌లో మనుసును కట్టిపడేసే పసందైన ఐస్‌క్రీంలు సందడి చేస్తున్నాయి. సామాన్యుల నుంచి ధనికుల దాకా అందుబాటులో ఉన్న ఐస్‌క్రీంలలో కొన్ని రకాలు వెనీలా, స్ట్రాబెర్రీ, చాక్‌లెట్‌, బట్టర్‌ స్కాచ్‌, ఫినాచిక్కీ, బ్లాక్‌ కరెంట్‌, ఖాజూ కిస్‌మిస్‌, ఫస్తా గ్రీన్‌, ప్రెష్‌ మ్యాంగో, ఫైనాఫిల్‌, ఒరియోఫట్టు, అమెరికన్‌ డ్రై పూట్‌, చాకోరోకో, క్రంచీ మంచీ, కెరామెల్‌ నట్స్‌, బెర్రీ బెర్రీ, పూట్‌ఫంచ్‌, ఆరెంజ్‌ ఫండా తదితర పేర్లతో మార్కెట్‌లో మనసులు దోసుకొనే రంగులు, రుచుల్లో లబిస్తున్నాయి.

వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు రావడంతో వాటి ధరలు అమాంతం పెంచి అమ్ముతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. కొందరు సామాన్యకుటుంబాల ప్రజలు మాత్రం అధిక ధరలకు అమ్ముతున్న ఐస్‌క్రీంలను కొనుగోలు చేసి తినలేక పోతున్నట్లు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement