Saturday, November 23, 2024

ఏపీలో మే 15 నుంచి వేసవి సెలవులు

ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. 1 నుంచి 9 తరగతులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి కానుండగా.. మే 1-10 తేదీల్లో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌లోడింగ్, ప్రమోషన్ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి సెలవులు ఇస్తారు. ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవు. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 30 లోగా సిలబస్‌ పూర్తి కానుండగా మే 1 నుంచి 16 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌ ఉంటుంది. మే 17 నుంచి 24 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు ఉంటాయి. మే 25 నుంచి జూన్‌ 6 వరకు ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్‌ ఉండగా.. జూన్‌ 7 నుంచి 16 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement