హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఏప్రిల్ లోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజు రోజుకు భానుడు ప్రతాపం చూపిస్తుడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు మరికొద్ది రోజులు తీవ్రమైన ఎండలను ఎదురొనాల్సి ఉంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా ఆదిలా బాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సింగరేణీ బొగ్గుగనుల ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరిం చింది. అలాగే రానున్న నాలుగైదు రోజుల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దు
ఏప్రిల్ 3,4 తేదీల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎండలు మండిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ జాఖ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఆరంజ్ అలర్ట్ చేసిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 40 కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక్కోసారి వడగాలులు వీచే అవకాశాలు కూడా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలో ఒకటి లేదా రెండు పర్యాయాలు వడగాలుల తీవ్రత ఉండనున్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలకంటే సుమారు 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి హెచ్చరించారు.
బిక్కనూరులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఈ మండలంలో 43. 8 డిగ్రీల ఉష్ణో గ్రత నమోదు కావడంతో ప్రజలంతా జాగ్రతగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వేసవికా లంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతల తేడాలను గుర్తించేందుకే వాతావరణ శాక ఎల్లో, అరెంజ్, రెడ్ రంగులతో అప్రమత్తం చేస్తు సిగ్నల్స్ ఇస్తుంది. 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలకు ఎల్లో, 41 నుంచి 45 వరకు ఆరంజ్, 45 నుంచి రెడ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ జారీ చేస్తుంది.ఉదయం నుంచి సాయంత్రం వరకు పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని అధికారులు తెలిపారు. అలాగే, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు, వడగండ్లు పడే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.