Tuesday, November 26, 2024

ముస్లిం యువతులే ‘సుల్లీ డీల్స్’ టార్గెట్.. 30 ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా మార్పింగ్ ఫొటోలు..

‘‘బుల్లి బాయ్.. సుల్లి డీల్స్’’ కేసులో ఢిల్లీ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ కేసులో కీలకమైన విషయాలు వెలగులోకి వస్తున్నాయి. ‘‘సుల్లి డీల్స్’’  వ్యవహారంలో దాదాపు 30 ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఉద్దేశపూర్వకంగా వినియోగించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ముస్లిం మహిళల ఫొటోలను వీటిద్వారా అప్ లోడ్ చేస్తూ వేలం వేసినట్టు విచారణలో తెలిసిందన్నారు.

26 ఏళ్ల ఇండోర్ యువకుడు ఔంకారేశ్వర్ ఠాకూర్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అతనితోపాటు బుల్లిబాయ్ టీమ్ లోని మెంబర్స్ ని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారని ఒక అధికారి తెలిపారు.

ఠాకూర్ తన ల్యాప్‌టాప్‌లోని విషయాలను డిలీడ్ చేశాడని, అతని ల్యాప్‌టాప్, ఫోన్‌లతో పాటు “బుల్లీ బాయి” యాప్ సృష్టికర్త .. అస్సాం నుండి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నీరాజ్ బిష్ణోయ్ ఫోన్‌లను నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. వాటి కంటెంట్‌లు, యాక్సెస్ వివరాలను నిర్ధారించడానికి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం వెయిట్ చేస్తున్నామని, అయితే ఈ క్రమంలో ట్విట్టర్ హ్యాండిల్స్ ను దుర్వినియోగం చేస్తున్న గ్రూప్‌లోని ఇతర సభ్యులను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన యాప్‌ను రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ఠాకూర్‌ను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఠాకూర్‌ని విచారించినప్పుడు అతను US నుండి వచ్చిన క్లయింట్‌లతో తన సొంత వెబ్-డిజైనింగ్ సంస్థను నడిపిన “ఇంట్రోవర్ట్” అని వెల్లడైంది.

ఠాగూర్ పగలంతా నిద్రపోయేవాడని, రాత్రిపూట పని చేయడం వల్ల అతనేం చేస్తున్నాడో తమకు తెలిసేది కాదని ఠాగూర్ తండ్రి పోలీసుల విచారణలో తెలిపాడు.  రాత్రులు మెలకువగా ఉండే అలవాటు గురించి అతని తల్లిదండ్రులు ప్రశ్నించగా, భారతదేశం, యుఎస్ మధ్య టైం తేడా ఉంటుంది కాబట్టే.. రాత్రంతా ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని తెలిపేవాడని, అందుకనే వారు ఠాకూర్‌ను ఎప్పుడూ అనుమానించలేదని ఓ పోలీసు అధికారి చెప్పారు.

- Advertisement -

ఠాకూర్, బిష్ణోయ్ ఇద్దరూ ఇట్లాంటి పనులకు రిగ్రేట్ కానప్పటికీ, అతని కారణంగా తన కుటుంబం సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని ఠాకూర్ వాపోయాడు. నిందితులు పురాతన సంప్రదాయం, హిందూ మతం యొక్క అప్ అండ్ డౌన్స్ గురించి చర్చలు జరిపే ఓ సంస్థలో  భాగమని పోలీసులు తెలిపారు. వారు ట్విట్టర్‌లో వివిధ అనోనిమస్ హ్యాండిల్‌లను సృష్టించారు. వారి గుర్తింపులను దాచడానికి ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికి వర్చువల్ ప్రైవేట్ నంబర్ (VPN)ని ఉపయోగించారు.

మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకరమైన ఫొటోలను అప్ లోడ్ చేయడానికి “సుల్లి డీల్స్” యాప్ ద్వారా కామెంట్స్ చేయడానికి కనీసం ముగ్గురు నుండి ఐదుగురు వ్యక్తులు ఈ బహుళ ట్విట్టర్ హ్యాండిల్స్ ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్‌లోని ఐపీఎస్ అకాడమీ నుండి బీసీఏ చేసిన ఠాకూర్.. ఇలాంటి యాప్ ”బుల్లీ బాయి”కి సంబంధించి అరెస్టులు చేసిన కొద్ది రోజుల తర్వాత శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. జూలైలో నమోదైన సుల్లి డీల్స్ యాప్ కేసులో ఇది మొదటి అరెస్టు అని, దీని విచారణకు కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

వందలాది మంది ముస్లిం మహిళలు మొబైల్ అప్లికేషన్‌లో అనుమతి లేకుండా ఫొటోగ్రాఫ్‌లతో “వేలం” కోసం లిస్ట్ తయారు చేశారు. ముస్లిం మహిళలను టార్గెట్ చేసి, వారిని కించపరిస్తూ ట్రోల్ చేసే గ్రూప్ లో తానకొ సభ్యుడి మాత్రమేనని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (IFSO) KPS మల్హోత్రా ప్రాథమిక విచారణలో నిందితుడు తెలిపాడు. “అతను గిట్‌హబ్‌లో కోడ్‌ను డెవలప్ చేశాడు. గ్రూప్‌లోని సభ్యులందరికీ గిట్‌హబ్ యాక్సెస్ ఉంది. అతను తన ట్విట్టర్ ఖాతాలో యాప్‌ను షేర్ చేశాడు. ముస్లిం మహిళల ఫొటోలను గ్రూప్ సభ్యులు అప్‌లోడ్ చేశారు” అని అధికారి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement