Tuesday, November 19, 2024

HYD: నాచారంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

వేధింపులు తాళలేక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నాచారంలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన చావుకి కారణం భర్తేనని పేర్కొంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది. ఫేస్ బుక్ లో లైవ్ వీడియో పెట్టి తన గోడు తెలిపింది. ఐదు నెలలుగా తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సన పేర్కొంది.

ఆ వీడియోలోనే సన ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపారు. తన భర్త హేమంత్ వేధింపులకు గురిచేస్తున్నా.. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని, వాళ్లు కూడా తమ ఇష్టానికి మాట్లాడారని తెలిపింది. భర్త వేధింపులు మరింత ఎక్కువ అవడంతో.. భరించలేక ప్రాణం తీసుకుంటున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement