Friday, November 22, 2024

TS | యువ‌కుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

జహీరాబాద్ (ప్రభ న్యూస్): అప్పుల బాధ‌తో ప్రాణాలు తీసుకోవ‌డానికి య‌త్నించిన ఓ యువ‌కుడిని స‌కాలంలో స్పందించి ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంతో ప్రాణాలు ద‌క్కాయి. ఓ కానిస్టేబుల్ ఈ సాహ‌సం చేసి, చ‌నిపోవాల‌నుకుని పాయిజ‌న్ తీసుకున్న ఓ యువ‌కుడిని భుజాల‌పై మోస్తూ స‌రైన స‌మ‌యానికి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాడు. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది.

జహీరాబాద్ నియోజకవర్గం అల్గొల్ గ్రామం నుండి పోలీసులకు 100 నెంబర్ కు ఆదివారం రాత్రి ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడు. ప్లీజ్ కాపాడండి అనే ఫోన్ కాల్ వ‌చ్చింది. త‌న‌ అన్న అయిన రాజు అప్పుల బాధ త‌ట్టుకోలేక‌ ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేశాడని, తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ‌డం లేద‌ని పోలీసుల‌కు తెలిపింది. ఎట్లా అయినా త‌న అన్న ఆచూకీ కనిపెట్టి కాపాడాలని అల్గోల్ గ్రామవాసి నర్సింలు కూతురు మహేశ్వరి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితుడి ఫోన్ నెట్వర్క్ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. అత‌ని ద‌గ్గ‌రికి చేరుకోగా మద్యంలో విషపదార్థాలు కలుపుకొని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించాడు..

బాధితుడు రాజు విషం సేవించిన ప్రాంతం అల్గొల్ అట‌వీ ప్రాంతం కాగా, అక్కడికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పోలీసు కానిస్టేబుల్ నాయిని జైపాల్, బాధితుడి చెల్లెలు మహేశ్వరి, వారి బంధువులు దాదాపు కిలోమీట‌రున్న‌ర కంటే ఎక్కువ దూర‌మే నడుచుకుంటూ వెళ్లి బాధితుడు కొన ఊపిరిపై ఉండడం గమనించారు. ఈ క్ర‌మంలో ఎలా అయినా అత‌ని ప్రాణాలు కాపాడాల‌ని కానిస్టేబుల్ జైపాల్.. బాధితుడు రాజును తన భుజంపై మోసుకొచ్చాడు. పోలీసు వాహనంలో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. స‌రైన స‌మ‌యానికి ఆస్ప‌త్రికి చేర్చ‌డంతో డాక్ట‌ర్లు ట్రీట్‌మెంట్ చేసి అత‌డి ప్రాణాలు కాపాడారు.

- Advertisement -

ఈ సందర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ.. చాకచక్యంగా వ్యవహరించి సరైన సమయానికి ఆసుపత్రికి తేవడం ద్వారానే బాధితుడు బ‌తికాడని, మరో పది పదిహేను నిమిషాలు ఆలస్యం అయితే ప్రాణం కాపాడి ఉండేవాళ్లం కాదన్నారు. సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ జైపాల్‌ని పోలీసులను అభినందించారు. చాకచక్యంగా వ్యవహరించి రాజు ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాయిని జైపాల్, ఇతర సిబ్బందిని డీఎస్పీ రఘు, సీఐ తోట భూపతి, ఎస్సై శ్రీకాంత్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement