లండన్: ఎలాంటి నొప్పి లేకుండా, ప్రశాంతంగా చనిపోయేందుకు వీలుగా స్విట్జర్లాండ్ కంపెనీ ఓకొత్త మెషీన్ తయారుచేసింది. శవపేటికలా ఉన్న ఈ మెషీన్‌లో పడుకుంటే… శరీరంలోని
ఆక్సిజన్ లెవెల్స్ ను తగ్గించేస్తుంది. రక్తంలో కార్బన్ డైయాక్సైడ్ ను కూడా తగ్గించడం ద్వారా నొప్పి లేకుండా ప్రాణాలు కోల్పోతారు. ఈ మెషిన్‌ను బయట నుంచే కాకుండా లోపల
నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. కనురెప్పలు ఆర్పుతూ,తెరవడం ద్వారా మెషీన్‌ను ఆన్ చేసేలా డిజైన్ చేశారు. ఎగ్జిట్ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వాహకులు. కారుణ్య మరణానికి
ఎదురుచూస్తున్న వారి కోసమే ఈ కొత్త మెషీన్‌ను తయారుచేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే ఈ మెషీన్త యారు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మెషీన్‌కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనుమతిని మంజూరు చేయడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..