Friday, November 22, 2024

పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. బ్యాడ్మింటన్‌లో యతిరాజ్‌కు సిల్వర్ మెడల్

టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ఎల్ 4 విభాగం ఫైనల్లో ఫ్రాన్స్‌ షట్లర్‌ మజుర్‌ లుకాస్‌ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్‌ రజతంతో ఇంటికి తిరిగి పయణమయ్యారు. ఈ పతకంతో పారా ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా టోక్యో పారా ఒలింపిక్స్‌ నేటితో ముగియనున్నాయి. చివరి రోజు భారత అథ్లెట్లు.. మరో మూడు పతకాల కోసం పోటీ పడనున్నారు.

కాగా విశ్వక్రీడల్లో మనదేశం తరఫున స్వర్ణం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అవని.. టోక్యో పారాలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనుంది. ఆదివారం జరుగనున్న కార్యక్రమంలో అవని త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందు నడవనుండగా.. భారత్‌ నుంచి 11 మంది ఇందులో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement