Friday, November 22, 2024

Life Style: షుగర్ లెవ‌ల్స్‌ని ఇట్లా ఈజీగా త‌గ్గించుకోవ‌చ్చు.. ఓసారి ట్రై చేస్తే పోలా!

కాఫీ, టీ, స్వీట్లు.. ఇట్లా ఏదో ఒక విధంగా షుగర్​ ఉన్న ఫుడ్​ తీసుకుంటారు చాలామంది. అయితే కొందరు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో షుగర్​ లెవల్స్​ పెరుగుతుంటాయి. షుగర్​ ఎక్కువైతే ఇన్​ఫ్లమేషన్​, డయాబెటిస్, కేన్సర్​, ఒబెసిటి వంటి హెల్త్​ ఇష్యూస్​ వచ్చే చాన్సెస్ ఉన్నాయి. మ‌రి ఉన్నపళంగా షుగర్​ ఉన్న ఫుడ్​ ఆపేస్తే అలసట, తలనొప్పి, క్రాంప్స్ వంటి సమస్యలు కూడా వ‌స్తాయంటున్నారు డాక్ట‌ర్లు. ఇలాంటి సమస్యలు రాకుండా స్వీట్లు తినాలనే కోరిక కలగకుండా ఉండేందుకు కిచెన్​లో సుగంధ ద్రవ్యాలు మంచి మెడిసిన్​గా పనిచేస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. షుగర్​కి ఆల్టర్నేట్​గా యాలకుల్ని తినాల‌ని చెబుతున్నారు.

కమ్మని వాసన, మంచి రుచి ఉన్న యాల‌కులు తింటే.. స్వీట్లు తినాలనే కోరిక రాకుండా చేస్తాయి. ఫ్రీరాడికల్స్ ఇన్సులిన్​ని విడుదల చేసే కణాల్ని డ్యామేజ్​ చేస్తుంటాయంటున్నారు డాక్ట‌ర్లు. ఫ్రీరాడికల్స్​​ని బయటకి పంపించి, ఇన్సులిన్​ రిలీజ్​ని పెంచడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. అదేవిధంగా నల్ల మిరియాల్లో పైపెరిన్​ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్​ గుణాలు హెల్త్ ఇష్యూస్ త‌లెత్త‌కుండా చూస్తాయి. ఇక‌.. పసుపులోని కర్​క్యుమిన్​ అనే ఆల్కలాయిడ్​ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. లవంగాలు ఇన్సులిన్​ సెన్సిటివిటీని పెంచుతాయి. రక్తంలో షుగర్​ లెవల్స్​ తగ్గడంలో సాయపడతాయి. యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలున్న దాల్చినచెక్క ఇన్సులిన్​ సిగ్నలింగ్​ని ఇంప్రూవ్​ చేస్తుంది. మ‌రి ఎందుకు ఆల‌స్యం.. ఇక మీ రోజువారీ అల‌వాట్ల‌లో యాల‌కులు, లవంగాలను చేర్చుకుంటే మేలే క‌దా..

Advertisement

తాజా వార్తలు

Advertisement