బీహార్ స్పెషల్ ఆర్మ్ డ్ పోలీసు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. కాగా 24గంటల తర్వాత విపరీతంగా తలనొప్పి , ఛాతీలోమంట వచ్చింది. దాంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తోటి సైనికులు అతన్ని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ కి తీసుకువెళ్ళారు. అక్కడ నుండి సెంటర్ సభ్యులు అతన్ని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్‌లో నియమితులైన మనోరంజన్ పాశ్వాన్ అనే సైనికుడి వివాహం మే 11న జరగాల్సి ఉంది. కాగా అతని తల ముందు వెంట్రుకలు రాలిపోయాయి, దాంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది. పెళ్లికి ముందు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ .. స్కిన్ కేర్ సెంటర్. పాట్నాలోని బోరింగ్ రోడ్‌లోని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ స్కిన్ కేర్ సెంటర్లో మనోరంజన్ చికిత్స పొందుతూ మరణించాడని మనోజ్ పాశ్వాన్ సోదరుడు వెల్లడించాడు. బీహార్ పోలీస్‌లో సబ్-ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మార్చి 9న హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడని తెలిపాడు. మనోజ్ మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..