సూడాన్ లో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి వందమంది మృతి చెందారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ వో ఆ వ్యాధి ఏంటనే విషయాన్ని కనుక్కోవడానికి ప్రత్యేక బృందాన్ని పంపింది. దక్షిణా సూడాన్‌లో జోంగ్లీ రాష్ట్రంలోని ఫాంగాక్ పట్టణంలో ఈ అంతుచిక్కని వ్యాధి పంజా విసురుతుంది. అధికారులు పేషెంట్ల నుంచి నమూనాలు స్వీకరించారు. కలరా టెస్టు చేయగా నెగెటివ్ వచ్చినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఆ దేశానికి పంపింది. ఆ వ్యాధి తీవ్రత, ముప్పును పరిశీలించాల్సిందిగా బృందాన్ని ఆదేశించింది. వ్యాధిపైనా ఆ బృందం పరిశోధనలు చేయనున్నట్టు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన షీల బాయా తెలిపారు.
కాగా అధికారికంగా ఇప్పటి వరకు 89 మంది ఈ మిస్టరీ డిసీజ్‌తో మరణించినట్టు సమాచారం. డబ్ల్యూహెచ్‌వోకు చెందిన సైంటిస్టులు ఫాంగాక్ నగరానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ రీజియన్‌లో భారీగా వరదలు రావడమే అందుకు కారణం. ఆ బృందం ఇప్పుడు దేశ రాజధాని జూబా పట్టణానికి తిరిగి రావడానికి ఎదురు చూస్తుంది. సూడాన్‌లో భారీ వరదలు వచ్చాయి. గత 60 ఏళ్లలో సూడాన్‌లో ఇవే భారీ వరదలు అని ఐరాస తెలిపింది. కాగా, ఈ వింత వ్యాధిపై దక్షిణ సూడాన్ ల్యాండ్ మినిస్టర్ లామ్ తుంగ్వార్ కుయిగ్వాంగ్ మాట్లాడారు. వరదలతోనూ ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. మలేరియా వ్యాధి విజృంభించడానికి ఈ వరదలు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని, పౌష్టికాహార లోపాన్ని (ఆహారం కొరత కారణంగా) పెంచుతున్నాయని చెప్పారు. ఈ రీజియన్‌లోని క్షేత్రాల నుంచి ఆయిల్ కూడా వరదల్లో కలిసిందని, అది తాగు నీటిని కలుషితం చేసిందని పేర్కొన్నారు. ఈ కలుషిత నీటి వల్ల జంతువులూ మృత్యువాత పడ్డాయని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..