Saturday, November 23, 2024

ఇంత చిన్న వ‌య‌సులో అంత సాహ‌స‌మా..

ప్ర‌భ‌న్యూస్: ఈ బుడతడి పేరు అద్విత్‌. వయసు నాలుగేళ్లు. ప్రస్తుతం ఇతడు ఎవరెస్టు బేస్‌క్యాంప్‌ను చేరుకున్నాడు. ఇంత‌ చిన్న వయసులోనే పర్వతా రోహడిగా గుర్తింపు పొందాడు. తద్వారా ఈ ప్రాంతానికి చేరుకున్న అందరికన్నా చిన్న ఆసియా వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అద్విత్‌ తల్లి శ్వేతా గోలేచా గత పదేళ్లుగా ట్రెక్కింగ్‌ చేస్తున్నారు. 2017లోఆమె బేస్‌ క్యాంప్‌కు వచ్చారు. అప్పు డు ఆమె గర్భవతి. తన కడుపులో బిడ్డ ఎవరెస్టు వద్ద రికార్డు నెలకొల్పాలని ఆ క్షణాన ఆమె సంకల్పించింది. అద్విత్‌ పుట్టిన తర్వాత అతడిని ఆ లక్ష్యందిశగా సిద్ధంచేస్తూ వచ్చింది. పట్టుదల, సంకల్పం, అభిరుచి అద్విత్‌కు ఎవరెస్టు ట్రెక్కింగ్‌ పట్ల మక్కువ కలిగించింది. తన తల్లి, మేన మామ సౌరభ్‌తో సుఖానితో కలిసి అక్టోబర్‌ 28న పర్వతారోహణ ప్రారంభించాడు. నవంబర్‌ 6న 5,364 మీటర్ల ఎత్తును చేరుకున్నాడు.

అద్విత్‌ శిక్షణ చిన్న వయసులోనే ప్రారంభమైంది. ఎందుకంటే శ్వేత అతడిని గాలి ఒత్తిడికి అలవాటు చేస్తూ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆమె కుటుంబం అబుదాబిలో 15వ అంతస్తులో ఉండేది. శిక్షణలో భాగంగా తన కుమారుడిని 15 అంతస్తులు మెట్లమార్గం గుండా కాలినడకన ఎక్కించడం అలవాటు చేసింది. అలా ఈ బుడతడు చిన్నప్పటి నుంచి నడవటం అలవాటు చేసుకున్నాడు. చివరకు ఆమె కృషి ఫలించింది. తన అసాధారణ స్వప్నాన్ని అద్విత్‌ నెరవేర్చాడు. ట్రెక్‌ చివరి దశలో అతడు కొంచెం ఇబ్బంది పడినా, బేస్‌క్యాంప్‌కు చేరుకోగలిగాడు. చాలా మంది పర్వతారోహకులు మావాడిని చూసి ఆశ్చర్యపోయారు అని శ్వేత తెలిపింది. అంతే కాదు 195 దేశాల జెండాలను చూసి రాజధానులను గుర్తించిన అతిపిన్న వయస్కుడిగాను అద్విత్‌ రికార్డు సృష్టించాడని శ్వేత గర్వంగా చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement