ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో మాట్లాడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ.. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. దీంతో విద్యార్థులు సీఎం మమతకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఉక్రేయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులతో మమత బెనర్జీ భేటీ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి నిరాశకు గురికావద్దన్నారు సీఎం. మెడికల్ ఇంటర్న్‌లకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఇంటర్న్‌షిప్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తుందన్నారు. స్టైఫండ్ కూడా ఇస్తుందని మమత చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం, బెంగాల్ ప్రభుత్వం నామమాత్రపు ఖర్చుతో రాష్ట్రంలో వారి విద్య కోసం ఏర్పాట్లు చేస్తుందన్నారు. 4వ, 5వ & 6వ సంవత్సరాల విద్యార్థులకు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించమని తాము మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని కోరుతామని సీఎం మమత అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital