నర్సాపూర్, (ప్రభ న్యూస్) : తమ పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ సమీపంలోని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. తమ పాఠశాలలో మరుగుదొడ్లు , కరెంటు, ఫ్యాన్లు, డోర్లు, ఆహారం సక్రమంగా లేవని దాంతో చాల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఎన్నోసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. వారం పది రోజులలో సమస్యల పరిష్కరించి రిపేర్లు చేయిస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement