Friday, November 22, 2024

దుస్తులంటే చిరాకు..అండర్ వేర్..టవల్ తో కాలేజ్ కి వెళ్తోన్న విద్యార్థి

ఓ విద్యార్థి అండర్ వేర్ ..తువ్వాలతోనే కాలేజ్ కి వెళ్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇది చూసిన కళాశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ యువకుడి పేరు కన్నయ్య. మధ్యప్రదేశ్‌ బడ్వానీకి చెందిన ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి దుస్తులు అంటే చిరాకట. ఎవరైనా చొక్కా, ప్యాంటు ధరించాలని చెబితే.. వారితో మాట్లాడడమే మానేసేవాడట. పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు.. తల్లిదండ్రులు కన్నయ్యకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు..బడ్వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ యువకుడిని చేర్పించేందుకు వెళ్తే.. యాజమాన్యం ప్రవేశం కల్పించలేదు. చివరకు కలెక్టర్‌ అనుమతితో ప్రవేశం లభించింది. అయితే, కళాశాలలో కచ్చితంగా దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన కన్నయ్య.. పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. కానీ ఉపాధ్యాయులు అందుకు ఒప్పుకోలేదు. కష్టపడి కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆ యువకుడు ఇంటర్‌ చదువుతున్నాడు. ఇప్పటికీ ఓ అండర్‌వేర్‌, పైనుంచి తువ్వాలు తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించకుండా కాలేజీకి వెళ్తుండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement